టీమిండియా అత్యంత చెత్త రికార్డు
టీమిండియా తన ఖాతాలో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఒక టెస్టులో ఐదు సెంచరీలు సాధించిన తర్వాత కూడా ఓటమిపాలైన జట్టుగా టీమిండియా నిలిచింది. 141 టెస్ట్ క్రికెట్ చరిత్రను ఏ జట్టు కూడా ఇటువంటి చెత్త ఫీట్ సాధించలేకపోయింది. టీమిండియా మాత్రం తొలి ఇన్నింగ్స్ లో ముగ్గురు, రెండవ ఇన్నింగ్స్ లో ఇద్దరు సెంచరీలు సాధించిన అనంతరం విజయం సాధించలేకపోయినా, డ్రాగా కూడా టెస్ట్ మ్యాచ్ ముగించలేకపోయింది. టీమిండియా పై రెండవ అత్యధిక స్కోర్ ఇంగ్లాండ్ తన బజ్ బాల్ క్రికెట్ ద్వారా చివరి రోజు ఛేదించింది. పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం అనుకూలించకపోయినప్పటికీ, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు మాత్రం తమ దూకుడును తగ్గించలేదు. 2010 తరువాత నాలుగవ ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్ గా బెన్ డకెట్ రికార్డు నెలకొల్పాడు. 2010 లో మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ సెంచరీ సాధించాడు. 2022 లో బర్మింగ్ హామ్ వేదికగా భారత్ నిర్దేశించిన 378 పరుగుల అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లాండ్ , ఇప్పుడు 371 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా అధిగమించింది
About The Author
