భర్త లైంగిక సుఖాన్ని ఇవ్వడం లేదని హత్య చేసిన భార్య

భర్త లైంగిక సుఖాన్ని ఇవ్వడం లేదని హత్య చేసిన భార్య

తనని లైంగికంగా తృప్తి పరచడం లేదన్న కోపంతో ఓ భార్య, భర్తను హత్య చేసి, కట్టు కథలను వినిపించింది. చివరకు పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన మొహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్ (32), ఫర్జానా ఖాన్(29) లు భార్యాభర్తలు. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఫర్జానా ఖాన్, ఇర్ఫాన్ ను తీసుకొని నిహాల్ విహార్ లోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఇర్ఫాన్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. అయితే ఇర్ఫాన్ శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు అందించిన సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఇర్ఫాన్ ఎలా చనిపోయాడని ఫర్జానాను పోలీసులు ప్రశ్నించగా, కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అతడు తనకు తాను గాయం చేసుకోలేదని, ఎవరు గాయం చేశారని తెలియడంతో పోలీసులు ఫర్జానాను తమదైన స్టైల్ లో  ప్రశ్నించగా విస్తు పోయే నిజాలను బయటపెట్టింది. ఇర్ఫాన్ ను తనని లైంగికంగా సంతృప్తి పరచడం లేదని అందుకే హత్య చేసినట్లుగా అంగీకరించింది.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు