మర్రిగూడ లో ఘనంగా టిడిపి ఆవిర్భావం దినోత్సవం 

మర్రిగూడ లో ఘనంగా టిడిపి ఆవిర్భావం దినోత్సవం 

 

 

మర్రిగూడ (పెన్ కౌంటర్):- 

 

 మండల కేంద్రంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మర్రిగూడ టిడిపి మండల అధ్యక్షులు దోమల వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ లో టిడిపి జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దోమల వెంకన్న మాట్లాడుతూ 1982 మార్చి 29 టిడిపి పార్టీ తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం, పేదల కోసం ఆవిర్భవించిందని ఆయన కొనియాడారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాలూకా వ్యవస్థను రద్దుచేసి మండల వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత ఎన్.టి.ఆర్ కే దక్కిందని ఆయన అన్నారు.1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (మిత్ర కూటమితో కలిసి) అత్యధికంగా 246 సీట్లు గెల్చుకుందని కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లు గెలుచుకొని ప్రతిపక్ష పార్టీ హోదాను సైతం కోల్పోయిందని విమర్శించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధంను అమలు చేశారని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కార్యదర్శి పుప్పాల యాదయ్య, మండల బిసి సెల్ అధ్యక్షులు కాసాల అంజయ్య,మర్రిగూడ గ్రామ శాఖ అధ్యక్షులు గుణగంటి శ్రీరాములు,ప్రధాన కార్యదర్శి దెవరకొండ సత్తయ్య,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పోలె మల్లయ్య,లెంకలపల్లి గ్రామ శాఖ వరికుప్పల శ్రీనివాస్,ఇందుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు వీరమళ్ళ మల్లేష్ గౌడ్,పిట్టల సత్తయ్య,ఖాసీం పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

మానవత్వం చాటుకున్న చిన్ననాటి మిత్రులు.. మానవత్వం చాటుకున్న చిన్ననాటి మిత్రులు..
            ​మహబూబ్ నగర్ (పెన్ కౌంటర్ ):   ​చిన్ననాటి స్నేహం కేవలం ఆటపాటలకే పరిమితం కాదని, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని
మర్రిగూడ లో ఘనంగా టిడిపి ఆవిర్భావం దినోత్సవం 
ఘనంగా శ్రీ నీలకంఠ రామస్వామి బ్రహ్మోత్సవాలు
సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి
పెన్ కౌంటర్ కథనంపై స్పందించిన అధికారులు..
చింతపల్లి లో నిబంధనలకు పాతర...?
వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత