మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటి అధికారుల దాడులు... కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు

మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటి అధికారుల దాడులు... కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కి చెందిన విద్యాసంస్థలలో పెద్ద ఎత్తున అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో నేపథ్యంలో ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా కింద సీట్ల కేటాయింపులలో మల్లారెడ్డి విద్యాసంస్థలలో అధిక ఫీజులను వసూలు చేస్తున్న పలు ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఐటి అధికారులు, మల్లారెడ్డి తో పాటు ఆయన కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతి రెడ్డి ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి సోదాలను నిర్వహించారు. అంతకుముందు ఆదాయ పన్ను శాఖ అధికారులు మల్లారెడ్డి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఆదాయాలపై ఆరా తీయగా, ఆదాయ పన్నుకు నివేదించిన లెక్కలకు, అందుబాటులో ఉన్న అకౌంట్స్ కు మధ్య పెద్ద ఎత్తున తేడాలు ఉన్నట్లు గుర్తించారు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు