కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం... ఏమి చర్చిస్తున్నారో అని సర్వత్రా ఆసక్తి
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కొనసాగుతోంది. ఈ భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మంత్రివర్గ సమావేశంలో సమీక్షించనున్నారు. గత మంత్రిమండలి సమావేశంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి స్టేటస్ రిపోర్టు మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు జరిగిన 18 మంత్రివర్గ సమావేశాలలో 327 నిర్ణయాలు, వాటి అమలు తీసుకున్న చర్యలపై సమీక్షించనున్నారు. ఎన్ డి ఎస్ ఏ, విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికల ఆధారంగా మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుల తీసుకునే అవకాశం పై చర్చించడంతోపాటు, స్టాంపులు రిజిస్ట్రేషన్ సవరణ చట్టం, పేదలకు రేషన్ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
About The Author
