కల్తీ కల్లు సేవించిన వారు అందుకే చనిపోయారా?!
కూకట్పల్లి కల్తీ కల్లు కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని భాజాపా ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కల్తీ కల్లు కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిజాలను దాస్తుందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాల మాటల దాడితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ కేసులో నిజ నిజాలను తేల్చేందుకు
ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కల్తీ కల్లు సేవించి ఐదు మంది మృతి చెందగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. రెండు రోజుల క్రితమే
కల్లు కాంపౌండ్ నుంచి కల్లు నమూనాలను సేకరించిన ఎక్సైజ్ అధికారులు, ఆ శాంపిళ్లను ల్యాబ్ పంపించి పరీక్షలను చేయించారు. కల్లులో కెమికల్ కలపడం వల్లే , ఆ కల్లు ను సేవించిన ఐదు మంది వ్యక్తులు మృతి చెందగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనలో ఇప్పటికే 7 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
About The Author
