గాంధీ భవన్ కు చేరిన వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయితీ

గాంధీ భవన్ కు చేరిన వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయితీ

వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయితీ మరోసారి గాంధీభవన్ కు చేరింది. ఇటీవల మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లాకు చెందిన శాసనసభ్యులను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసులను జారీ చేసింది. పార్టీ జారీ చేసిన నోటీసులకు క్రమశిక్షణ సంఘం ముందు హాజరై కొండా మురళి వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన వ్యతిరేక వర్గీయులైన జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి గాంధీ భవన్ కు చేరుకొని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు