బనకచర్లపై జగన్ వ్యాఖ్యలు... ఇరకాటంలో వైకాపా..
పోలవరం, బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరకాటంలో పడేశాయి. ఢిల్లీ వేదికగా జలశక్తి మంత్రి పాటిల్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల భేటీ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఈ తరహా ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందని పలువురు మండిపడుతున్నారు..పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం సరి కాదంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాయలసీమ జిల్లాల నేతలు మండిపడుతున్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ కరువు నిర్మూలన కోసం ఉద్దేశించిన బనకచర్లను వ్యతిరేకించడమంటే, ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు.
About The Author
