తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలతో మూసీ నదికి వరద పోటెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం మండల పరిధిలోని భీమ లింగం వద్ద వరద ఉదృతి తీవ్రంగా ఉంది. హైదరాబాదులో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలన్నీ పొంగిపొర్లుతున్నాయి.
About The Author
