ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

జూలై నెలలో 90 కేసులలో 106 మంది బాల కార్మికుల రెస్క్యూ .. కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

 

నల్లగొండ(పెన్ కౌంటర్):-

పలకా బలపం పట్టి బడిబాట పట్టాల్సిన బాలలను, వెట్టి చాకిరీతోనే బంధీ అయిపోతున్న పసి బాల్యాన్ని తమ చేతులతో ఒడిసి పట్టుకుని వారిని విముక్తుల్ని చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏంకంగా 106 మంది పసిపిల్లల భవితవ్యం అంధకారంలో మునిగిపోకుండా కాపాడి శబాష్ నల్లగొండ పోలీసులని నిరూపించుకున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం, రాష్ట్ర పోలీస్‌ శాఖ నేతృత్వంలో, ప్రతీ ఆరు నెలలకోసారి ఆపరేషన్‌ స్మైల్, ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో, బాలకార్మికులు వ్యభిచార కూపంలో చిక్కుకు పోయిన మైనర్లను, వీధిబాలలను, ఇటుకబట్టీలో నిర్బంధ కార్మికులుగా ఉన్నవారిని, ముష్టి మాఫియా చేతుల్లో బందీలుగా ఉన్నవారిని, ఇండస్ట్రియల్ కంపెనీల్లో పనిచేసే వారిని కాపాడేందుకు, ఈ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు సబ్ డివిజన్లలో, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో, పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో, టీమ్ లుగా ఏర్పడి ఒక్క జూలై నెలలోనే 90 కేసుల్లో 106 మంది పిల్లలను రెస్యూ చేయడం, వీరిలో 94 మంది బాలలు 12 మంది బాలికలు, వీరంతా ఎక్కువగా ఇతర రాష్ట్రాలైన బీహార్, చత్తీస్గడ్, ఒరిస్సా, యూపీ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు కావడం గమనార్హం.

 

 

బాల కార్మికులకు చేత పనులు చేయించుకుంటే కఠిన చర్యలు తప్పువు

 

జిల్లాలో బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం, బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. బాల కార్మికులకు చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వీధి బాలలను, బాల కార్మికులను చూసినప్పుడు, డయల్ 100 కానీ 1098 కానీ, స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

మానవత్వం చాటుకున్న చిన్ననాటి మిత్రులు.. మానవత్వం చాటుకున్న చిన్ననాటి మిత్రులు..
            ​మహబూబ్ నగర్ (పెన్ కౌంటర్ ):   ​చిన్ననాటి స్నేహం కేవలం ఆటపాటలకే పరిమితం కాదని, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని
మర్రిగూడ లో ఘనంగా టిడిపి ఆవిర్భావం దినోత్సవం 
ఘనంగా శ్రీ నీలకంఠ రామస్వామి బ్రహ్మోత్సవాలు
సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి
పెన్ కౌంటర్ కథనంపై స్పందించిన అధికారులు..
చింతపల్లి లో నిబంధనలకు పాతర...?
వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత