బయటపడ్డ సచివాలయ నిర్మాణ డొల్లతనం... పెచ్చులూడిన భవనం
గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడింది. గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆరవ అంతస్థుల నుంచి పెచ్చులూడి కారుపై పడిన ఘటన మరువక ముందే, గురువారం కూడా సచివాలయ భవన పై కప్పు నుంచి పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. అదృష్టవశాత్తు పెచ్చులూడి పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్ వెళ్లే మార్గంలోని లోపల లాన్ మార్గంలో, ఈ పెచ్చులు ఊడిపోయినట్లు సచివాలయ నిర్వహణ అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన సచివాలయాన్ని నేలమట్టం చేసి గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ , నూతన సచివాలయాన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థలు నాణ్యత ప్రమాణాలను సక్రమంగా పాటించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ప్రజాధనాన్ని వెచ్చించి వందల కోట్ల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవన నిర్మాణ డొల్లతనం బయటపడడంతో , మరోసారి నలువైపుల నుంచి గత ప్రభుత్వాన్ని ప్రజా సంఘాలు టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు.
About The Author
