కవిత కొత్త పార్టీ ఖాయం... పేరేంటి అంటే?!
భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ )నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లుగా ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె బీసీ ఎజెండాతో పార్టీ పేరును కూడా ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరిట ప్రజల్లోకి వెళ్తున్న కవిత, త్వరలోనే కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. భారత రాష్ట్ర సమితికి పోటీగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరిట ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కవిత బీసీ రిజర్వేషన్లపై బలంగా తన గలాన్ని వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సొంత పార్టీని స్థాపించి, ఎన్నికల బరిలోకి తమ అభ్యర్థులను దించితే... బీ ఆర్ ఎస్ అభ్యర్థులకు ఎంతో కొంత నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
About The Author
