మోటార్ సైకిల్ దొంగలను అరెస్ట్ చేసిన హాలియా పోలీసులు.

ఎనిమిది కేసులలో 10 మోటార్ సైకిళ్ళు స్వాధీనం

మోటార్ సైకిల్ దొంగలను అరెస్ట్ చేసిన హాలియా పోలీసులు.

నల్లగొండ(పెన్ కౌంటర్)

 

 

హలియా పోలీస్ స్టేషన్ పరిధిలో, ఇటీవల బైక్ దొంగతనాలపై జరిపిన దర్యాప్తులో, పోలీసులు 8 కేసుల్లో మొత్తం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వేరు వేరు కేసుల్లో 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంవత్సరం జూన్ 19న హలియా బస్ స్టాండ్ వద్ద, ఓ వ్యక్తి తన బజాజ్ ప్లాటినం బైకును పార్క్ చేసి వెళ్లగా, అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అట్టి బైక్ ను దొంగిలించిన విషయంలో, అతను హాలియా పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసాడు. అట్టి పిర్యాదుపై కేసు నమోదు చేసి, విచారణలో భాగంగా శుక్రవారం హాలియ ఎస్ఐ వారి సిబ్బంది, అలీనగర్ చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా, సరైన వాహన పాత్రలు లేకుండా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా, పిర్యాదుదారుడి బైక్ దొంగతనంతో పాటు, ఆతను మరో ఆరు బైక్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో అతని నుండి ఆరు బైక్ లను స్వాదినపరుచుకొని, ఆ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి, జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహమ్మద్ జానీ అనే వ్యక్తి, ఈజీ మనికి అలవాటుపడి, హలియా, నిడమనూర్, హైదరాబాద్ లోని ఆదిబట్ల ప్రాంతాల్లో, ఆర్టీసీ బస్ స్టాండ్ లలో పార్క్ చేసిన బైకులనే లక్ష్యంగా చేసుకొన, నకిలి తాళం చెవి ఉపయోగించి దొంగతనాలు చేసేవాడు. సిబి యూనికార్న్ బైక్ పోయిందని హాలియా పోలీసులకు అందిన మరో పిర్యాదు మేరకు, అనుముల గ్రామశివారున, ద్వారకాపురి కమాన్ వద్ద అనుమానాస్పదంగా, సరైన వాహన పత్రాలు లేకుండా తిరుగుతున్న, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, పైన తెల్పిన బైక్ దొంగతనంతో పాటు వారు మరో రెండు బైక్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో వారి నుండి నాలుగు బైక్ లను స్వాదినపరుచుకొని, వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ దొంగతనానికి పాల్పడినది దేవనబోయిన శ్రీను అలియాస్ కుప్పయ్య, వేముల నాగరాజు పిచ్చయ్య లుగా గుర్తించారు. వీరు హలియా, మిర్యాలగూడ పట్టణం, మాచర్ల, గుంటూరు, రెంటచింతల, కారంపూడి ప్రాంతాల్లోని పార్క్ చేసిన బైకులను లక్ష్యంగా చేసుకొని, దొంగతనాలు చేస్తున్నారు. ఇందులో దేవనబోయిన శ్రీను గతంలో ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఆరు బైక్ లకు సంబందించి దొంతనం కేసులు నమోదయ్యాయి. చట్టాన్ని చేతిలో తీసుకొని ఇల్లీగల్ గా పనులు చేసే వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఈ సందర్బంగా ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసులను ఛేదించడంలో మిర్యాలగూడ డియస్పీ కె.రాజశేకర్ రాజును, హలియా సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.సతీష్ రెడ్డిని, హలియా ఎస్ఐ బి.సాయి ప్రశాంత్ ని, వారి సిబ్బంది కానిస్టేబుళ్లు సురేష్, హరి ప్రసాద్, రమేశ్ గౌడ్, శ్రవణ్, శివరాజ్, సుభాష్, రైటర్ కృష్ణ లను అభినందించి వారికి నగదు బహుమతి ప్రకటించారు.

 

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు