తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు డిఎస్పీలు స్పాట్ డెడ్
By Anand kumar
On
విజయవాడ జాతీయ రహదారి పై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ తోపాటు, కారులో ఉన్న అడిషనల్ ఎస్పీ తీవ్ర గాయపడ్డారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపూర్ వద్ద జరిగిన ఈ రోడ్డు దుర్ఘటనలో పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి, లారీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. దీనితో కారులో ప్రయాణిస్తున్న డి.ఎస్.పి చక్రధర్ రావు, కాంతారావు అనే ఇద్దరూ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పోలీసు అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ రావుకు తీవ్ర గాయాలు కాగా, వాహన డ్రైవర్ నర్సింగ్ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని హుటా, హుటిన ఆసుపత్రికి తరలించారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
23 Apr 2026 14:20:44
మహబూబ్ నగర్ (పెన్ కౌంటర్ ):
చిన్ననాటి స్నేహం కేవలం ఆటపాటలకే పరిమితం కాదని, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని
