వల్లభనేని వంశీ బెయిల్ రద్దు?!... ముందస్తు బెయిల్ తీర్పు పై సుప్రీంకోర్టు ఆక్షేపణ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ రద్దు కానుందా?, అంటే సుప్రీంకోర్టు ఆదేశాలను పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది. వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనాలను వినకుండానే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని, ఇది సరైన విధానం కాదంటూ ఆక్షేపించింది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు చేసిన వ్యాఖ్యలతో వల్లభనేని వంశీ బెయిల్ రద్దు కానుందని నీ న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో మెరిట్స్ పరిగణలోకి తీసుకొని విరుపక్షాల వాదనలు విన్న నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. హైకోర్టులో
వారం రోజుల వ్యవధిలో కౌంటర్ దాఖలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి తెలిపారు.
About The Author
