అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం... ఇద్దరు కూలీల పరిస్థితి విషమం
By Anand kumar
On
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి చెందిన అనురాగ్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలి నలుగురు కూలీలు గాయపడడ్డారు. ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని కూలీలు మీడియా ప్రతినిధులకు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే కూలీలను ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్యం అందిస్తున్నప్పటికీ, ఇద్దరూ తీవ్రంగా గాయపడడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Tags:
About The Author

Latest News
11 Aug 2025 17:03:40
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...