ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం... 11 కోట్లు స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు

ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం... 11 కోట్లు స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు

గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో ఒక్కొక్కటిగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 40వ నిందితుడుగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి, ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ పోలీసులుకాచారంలోని ఒక ఫామ్ హౌస్ లో దాచిపెట్టిన 

 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2024 లో ఇక్కడ డబ్బులను దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, చాణక్యలు కలిసి దాచి పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. వర్ధమాన్ కాలేజీ ఎదురుగా ఉన్న ఈ ఫామ్ హౌస్ తీగల బ్రదర్స్ దిగా సిట్ పోలీసులు గుర్తించారు. యు వి డిస్టలరీస్ లో తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు భాగస్వాములుగా ఉన్నారు. వీరికి ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి 224 కోట్ల రూపాయల విలువైన మద్యం కాంట్రాక్టు లభించగా, వీరు 29.80 కోట్ల రూపాయలను ముడుపుల రూపంలో చెల్లించినట్లుగా ఆధారాలు సిట్ పోలీసులకు లభించాయి. ఈ కేసులో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తుండడంతో, గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వారి మెడకు ఉచ్చు బిగుస్తోంది.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు