విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రాణాలపై ఈడీ కేసులు.
By Anand kumar
On
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా అక్రమార్జనకు పాల్పడిన సినీ నటులు, సెలబ్రిటీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ( ఈడి ) కేసులు నమోదు చేసింది. వివిధ బెట్టింగ్ యాప్స్ కు 29 మంది ప్రమోషన్ చేసినట్లు గుర్తించిన ఈ డి వారిపై కేసులు నమోదు చేసి, విచారణ జరుపనుంది. ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసి త్వరలోనే వారిని విచారణకు పిలవనుంది. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ పై కూడా సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిని కూడా ఈడి , పి ఎం ఎల్ ఏ కింద విచారించనుంది.
Tags:
About The Author

Latest News
11 Aug 2025 17:03:40
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...