రెండేళ్లుగా తిండి పెట్టని భర్త... అనుమానాస్పద స్థితిలో భార్య మృతి..
కట్టుకున్న భార్యను ఓ ప్రబుద్ధుడు రెండేళ్లుగా తిండి పెట్టకుండా హింసించిన సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట లో చోటుచేసుకుంది. చివరకు ఆ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా విశ్వనాధ పురానికి చెందిన లక్ష్మీ ప్రసన్న (33) ను పూల నరేష్ కు ఇచ్చి 2015లో వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి లక్ష్మీ ప్రసన్నకు అత్తగారింట్లో కష్టాలుతప్పడం లేదు. గత రెండేళ్ల నుంచి మరి సైకోలో ప్రవర్తిస్తూ, భార్యకు తిండి పెట్టడం మానేశాడు. చివరకు శనివారం నాడు లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులకు పూల నరేష్ ఫోన్ చేసి మీ కూతురు మెట్ల పైనుంచి జారిపడిందని... ఆసుపత్రిలో చేర్చామని సమాచారం అందించాడు. ఆసుపత్రికి వెళ్లి చూసిన తల్లిదండ్రులు, చిక్కి శల్యమైన లక్ష్మీప్రసన్నను తొలుత గుర్తించలేకపోయారు. వరకట్నం కోసం తమ అల్లుడే తన కూతురిని తిండి పెట్టకుండా హింసించి చంపి వేశాడని లక్ష్మీ ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
About The Author
