సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద నున్న జెమ్ కిడ్నీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బి సంతోష్, సమాజ హితం కోసం డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు పూర్తిగా తగ్గించి రోగులకు వైద్య సేవలను అందిస్తున్నారు. సాధారణంగా కన్సల్టేషన్ ఫీజు 650 రూపాయలు తీసుకునే ఆస్పత్రి యాజమాన్యం, 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 79 రూపాయలను మాత్రమే కన్సల్టేషన్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. 2025వ సంవత్సరానికి గుర్తుగా వివిధ పరీక్షలను 2025 రూపాయలకే చేస్తున్నట్లుగా వివరించారు. కిడ్నీల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని డాక్టర్ బి సంతోష్ సూచించారు. వీలైనంత ఎక్కువగా మంచినీటిని సేవించడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధుల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చునని ఆయన తెలిపారు.
About The Author
