విధి నిర్వహణలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్... అతడి కుటుంబానికి అండగా ఉంటామన్న బ్యాచ్ మేట్స్
By Anand kumar
On
భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండగా ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై ఆసుపత్రిలో మృతి చెందాడు. మంచాల గ్రామానికి చెందిన పసుల వెంకటేష్ ముదిరాజ్ భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులను నిర్వహి స్తున్నారు. గత పది రోజుల క్రితం ఆయన విధుల్లో ఉండగా గుండెపోటుకు రావడంతో, తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ తుది శ్వాస విడిచారు. అతడి దశదినకర్మను నేడు స్వగ్రామమైన మంచాల మండల కేంద్రంలో నిర్వహించగా, 2007 కు చెందిన వెంకటేష్ ముదిరాజ్ బ్యాచ్ మేట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వెంకటేష్ కుటుంబానికి 2, 13,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్ రూపం లో అందజేసి, భవిష్యత్తులో తమ మిత్రుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
23 Apr 2026 14:20:44
మహబూబ్ నగర్ (పెన్ కౌంటర్ ):
చిన్ననాటి స్నేహం కేవలం ఆటపాటలకే పరిమితం కాదని, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని
