మద్యం కుంభకోణంలో కుట్ర దారుడిగా మిథున్ రెడ్డి... తేల్చిన సిట్
ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం స్కాంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ని కుట్ర దారునిగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) పేర్కొంది. మద్యం కుంభకోణంలో A4 నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డిని సి ట్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు నుంచి మొదలుకొని సుప్రీం కోర్టు వరకు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఏసీబీ కోర్టులో హాజరు పరచడానికి ముందు మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు పెట్టారని, ఈ కేసు కోర్టు ముందు నిలబడదని ఘంటాాపతంగా తేల్చి చెప్పాడు. అయితే ఈ కేసులో డబ్బుల వ్యవహారాలన్నీ మిథున్ రెడ్డినే చూసుకున్నట్టు సిట్ పోలీసులు తెలిపారు. డిస్టలరీలు, ఇతర సప్లైదారుల నుంచి మిథున్ డబ్బులు వసూలు చేశాడని పేర్కొన్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్య ప్రసాద్ కు ఐఏఎస్ పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి, ప్రత్యేక అధికారిగా నియమించారన్న సిట్ పోలీసులు, ఈ కుట్ర అమలుకు ఆయన్ని ఉపయోగించుకున్నారని తెలిపారు. డిస్టలరీల నుంచి ముడుపులను సేకరించిన మిథున్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని వివరించారు. మద్యం కుంభకోణంలో కుట్ర కోణాన్ని ఛేదించేందుకు లోతైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని, ఇంకా కొంతమందిని విచారించాల్సి ఉన్నట్లు సిట్ పోలీసులు వెల్లడించారు.
About The Author
