కొడుకుల నుంచి రక్షణ కోరిన తల్లిదండ్రులు...  

కొడుకుల నుంచి రక్షణ కోరిన తల్లిదండ్రులు...  

 

 తన కొడుకుల నుంచి రక్షణ కల్పించాలని  ఓ వృద్ధ దంపతుల జంట పోలీసులను ఆశ్రయించింది. వివరాలలోకి వెళ్తే...
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన దగినేపల్లి అనసూర్యమ్మ, బుచ్చిరెడ్డిలు దంపతులు. వీరిద్దరూ  తమ కుమారుల నుంచి రక్షణ కావాలని  స్థానిక డిఎస్పి రాజశేఖరరాజును కలిసి విన్నవించారు. తన పెద్ద కుమారుడు శ్రీనివాస్ రెడ్డి, కోడలు మణియమ్మ, వాళ్ల కొడుకు సందీప్ రెడ్డిలు కుట్రపూరితంగా దుర్భశలాడుతున్నారని, మానసికంగా వేధిస్తున్నారని, దాడి చేశారని చర్యలు తీసుకోవాలన్నారు.  కుమారులు ఇద్దరికి ఒక్కొకరి 3ఎకరాల10 గుంటల  భూమి చొప్పున పంచి ఇచ్చి ఇద్దరికి రిజిస్టేషన్ చేశామన్నారు. మిగిలిన 3 ఎకరాల 11 గుంటల భూమిని తమ ఆరోగ్యం, పోషణ నిమితం ఉంచుకున్నామన్నారు. నా ఇద్దరు కుమారులు నన్ను నానా బాధలు పెట్టడం చూసుకోకపోవడంతో నా చిన్న కుమారుడి కొడుకు దిలిప్ రెడ్డి వద్ద మేం ఉంటున్నామన్నారు. మనవడు దిలిప్ రెడ్డి చూసుకోవడంతో మాకు నమ్మకం కుదిరి మా భాగానికి ఉన్న భూమిని మనవడికి రిడిస్ట్రేషన్ చేయడంతో నచ్చని నా కుమారుడు శ్రీనివాస్ రెడ్డి, కోడలు మనుమలు, ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని కుమారుడయిన సందీప్ రెడ్డితో కలసి గతంలో వృద్దులమైన మాపై విచక్షణరహితంగా దాడి చేశారన్నారు. సోషల్ మీడియా, వీడియో వైరల్ కావడంలో ఆధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేసిన విషయాన్ని మరచి పోకుండా తరచూ మాపై కుట్ర పూరితంగా, మానసికంగా వేదింపులకు గురి చేస్తు ఆదివారం ఉదయం 7:30గంటలకు నా మనవడికి రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో   దున్నూకుంటు ఉంటే పెద్ద కొడుకు, కోడలు అడ్డం వచ్చి దుర్భశలాడుతూ దాడికి దిగారనీ, చేయి చేసుకోబోయారని వృద్ధ తల్లి దండ్రులు పేర్కొన్నారు. వారి నుండి తమకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని వారు కోరారు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు