ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు
గణేష్ నిమజ్జోత్సవాలలో భాగంగా ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో రూపొందించిన పర్యావరణహితమైన బోటు ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్ చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఈ బోటును ఉపయోగిస్తున్నారు. పూర్తిగా ప్లాస్టిక్ బాటిల్స్ తో రూపొందించారు. ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ ను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చునో, ఈ బోటు తయారీ ద్వారా నిరూపించారు. ఇదే బోటు ద్వారా గణేష్ నిమజ్జనోత్సవం అనంతరం చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించనున్నట్లు మున్సిపల్ సిబ్బంది తెలిపారు. వానలు వచ్చి వరదలలో మునిగిపోయిన వారిని కూడా ఈ బోటు ద్వారా కాపాడే అవకాశం ఉందని ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈ బోటును రూపొందించిన వారు తెలిపారు. మాసబ్ చెరువులో ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ బోటును తిలకించిన ప్రతి ఒక్కరు ఔరా అంటూ అభినందిస్తున్నారు.
About The Author
