వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల
నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డును దక్కించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. చివరకు
పెన్ కౌంటర్ దినపత్రిక సిఎండి నాగుల ఆనంద్ కుమార్ నేత అత్యధికంగా 69, 999 రూపాయలకు వేలంపాటలో పార్వతి కుమారుడు చేతిలో పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నాడు. వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న నాగుల ఆనంద్ కుమార్ నేత దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించి, ఆయన కు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగుల ఆనంద్ కుమార్ నేత మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య చేతిలోని లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. భగవంతుడు కరుణిస్తే భవిష్యత్తులోనూ వినాయక మండప నిర్వాహకులకు తన చేతనైన సహాయ సహకారాలను అందిస్తానని నాగుల ఆనంద్ కుమార్ నేత తెలిపారు.ఈ కార్యక్రమం అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి,ట్రెజరీ మోహన్ లాల్, కాలనీ ముఖ్య సలహాదారుడు రాజు నాయక్, శ్రవణ్ కుమార్, కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, పుల్లారెడ్డి, మిమిక్రీ రమేష్, సూర్యం, బుచ్చిరెడ్డి, జగాల్ రెడ్డి, మోతిరామ్, కరుణాకర్ రావు, మరియు పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు పాల్గొన్నారు..
About The Author
