సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి

నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పీల్

సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి

 

*ప్రశాంత వాతావరణంలో ఇతరులకు హానికలిగించకూడదు*

 

*మహిళల భద్రతకు ప్రత్యేక నిఘాతోషీటీమ్‌ల ముమ్మర పహారా*

 

 *డ్రంక్ అండ్ డ్రైవ్ ఉల్లంఘనలపై కఠినచర్యలు*

 

*నల్లగొండ జిల్లా ప్రతినిధి (పెన్ కౌంటర్):-*

 

దేశ వ్యాప్తoగా రేపు నిర్వహించుకోనున్న హోళీ పండుగ సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలందరూ సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించు కోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పీల్ చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలి పారు. హోలీ పండుగను సాంప్రదాయబద్ధంగా, పరస్పరగౌర వంతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని జిల్లా ప్రజలను కోరారు.హోళీ వేడుకల సందర్భంగా సహజసిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించాలని, హానికరమైన రసాయనిక రంగులను వాడకూడదని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా బలవంతoగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలు, రహదారుల పై వాహనదారులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని తెలిపారు.మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం జిల్లాలో షీటీమ్ బృందాలను ప్రత్యేకంగా మోహరింపజేసి, ప్రధాన కూడళ్లలో మరియు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పండుగ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్ల కూడదని, చిన్నపిల్లలను అటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లరాదని విజ్ఞప్తి చేశా రు. లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.పండుగ వేళ ఎవరైనా గొడవలు సృష్టించినా, అసత్య ప్రచారం చేసినా, సామాజిక మాధ్యమాల ద్వారా అపోహలు వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.జిల్లా ప్రజలందరూ కలిసిమెలిసి, పరస్పర గౌరవంతో ఇతరు లకు ఆటంకంకలగకుండా సురక్షితంగా హోళీ పండుగను జరుపుకొని పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

మానవత్వం చాటుకున్న చిన్ననాటి మిత్రులు.. మానవత్వం చాటుకున్న చిన్ననాటి మిత్రులు..
            ​మహబూబ్ నగర్ (పెన్ కౌంటర్ ):   ​చిన్ననాటి స్నేహం కేవలం ఆటపాటలకే పరిమితం కాదని, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని
మర్రిగూడ లో ఘనంగా టిడిపి ఆవిర్భావం దినోత్సవం 
ఘనంగా శ్రీ నీలకంఠ రామస్వామి బ్రహ్మోత్సవాలు
సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి
పెన్ కౌంటర్ కథనంపై స్పందించిన అధికారులు..
చింతపల్లి లో నిబంధనలకు పాతర...?
వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత