వివాహేతర సంబంధం వద్దన్నా వినని భార్యను హత్య చేసిన భర్త

వివాహేతర సంబంధం వద్దన్నా వినని భార్యను హత్య చేసిన భర్త

భార్య ఎంతో చెప్పినా వివాహేతర సంబంధాన్ని మానుకోకపోవడంతో ఆగ్రహించిన భర్త ఆమెను గొంతు నలిపి హత్య చేసిన సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కడప జిల్లాలోని చాపాడు మండలం చిన్నయ్యపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల సుజాత (40) ను ఆమె భర్త ప్రైవేటు బస్సు డ్రైవర్ అయిన గోపాల్ హత్య చేసి శవం ఎవరికీ కనిపించకుండా మాయం చేసే ప్రయత్నం చేశాడు. గోపాల్ స్వయాన అక్క కూతురైన సుజాత గత రెండేళ్లుగా బాబు అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. వివాహేతర సంబంధాన్ని మానుకొని బుద్ధిగా నడుచుకోవాలని గోపాల్ ఎన్నిసార్లు హితవు చెప్పిన సుజాత పెడచెవిన పెట్టి , యధావిధిగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన సుజాత తో గొడవ పడిన గోపాల్ ఆమెను గొంతు నులిమి హత్య చేసి శవాన్ని గోనెసంచిలో కట్టుకొని తన ద్విచక్ర వాహనంపై మైదుకూరు, పోరుమామిళ్ల దారిలో ఎద్దడుగు కనుమలోని ముళ్ళ పొద గుంతలో పడేశాడు. కూతురు కనిపించకపోయేసరికి తల్లి పార్వతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు