కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి ఎన్ఎస్ యుఐ స్కెచ్?!... భారీగా మోహరించిన పోలీసులు
By Anand kumar
On
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎన్ ఎస్ యు ఐ విభాగానికి చెందిన కార్యకర్తలు దాడి చేస్తారేమోనన్న అనుమానంతో పోలీసులు కొండాపూర్ లోని అతడు ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లు ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హీరోయిన్ల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు . కౌశిక్ రెడ్డి తరచూ ముఖ్యమంత్రి లక్ష్యంగా చేసుకుని విమర్శలను గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన ఇంటిపై ఎన్ఎస్ యుఐ కార్యకర్తలు దాడి చేస్తారన్న అనుమానంతో పోలీసులు ఆయన ఇంటి చుట్టూ భారీగా బలగాలను మోహరించి భద్రత చర్యలను చేపట్టారు.
Tags:
About The Author
Related Posts
Latest News
23 Apr 2026 14:20:44
మహబూబ్ నగర్ (పెన్ కౌంటర్ ):
చిన్ననాటి స్నేహం కేవలం ఆటపాటలకే పరిమితం కాదని, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని
