బైక్ ను డీకొన్న ట్యాంకర్ - తండ్రి, కూతురు మృతి
షాద్ నగర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన రియల్టర్ మచ్చేందర్
మచ్చేందర్ కు ఒకటే కూతురు మైత్రి
పెన్ కౌంటర్, షాద్ నగర్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ సంఘటన స్థానికులను ఎంతగానో కలచివేసింది. పట్టణంలోని శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్న మచ్చేందర్ (48) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. అతనికి ఒక్కతే కూతురు మైత్రి ఉంది. శంషాబాద్ లోని వర్ధమాన్ కళాశాలలో మైత్రి బీటెక్ చదువుతోంది. మచ్చేందర్ స్వగ్రామం పెద్ద షాపూర్ అని స్థానికులు తెలిపారు. వ్యాపార రీత్యా శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటూ సెటిల్ అయ్యాడు. రోజువారి కార్యక్రమాలలో భాగంగానే శనివారం మచ్చేందర్ తన కూతురుని వర్ధమాన్ కళాశాలకు బైక్ పై ఎక్కించుకొని షాద్ నగర్ బస్ స్టేషన్లో విడిచిపెట్టడానికి వెళ్తున్న క్రమంలో అతివేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో తండ్రి కూతుళ్లు ఇద్దరు లారీ కింద పడ్డారు. సంఘటనా స్థలంలోనే కాసేపు రక్షించమని అందర్నీ వేడుకున్నారు. ప్రమాద ఘటన తీవ్రస్థాయిలో ఉండడంతో వారు కొద్దిసేపట్లోనే మరణించారు. మచ్చేందర్ విషాద సంఘటనను చూసిన స్థానికులు, పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
About The Author
