బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు... గూగుల్, మోటా కు ఈడి నోటీసులు
By Anand kumar
On
ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ వేదికగా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ లో ప్రోత్సహిస్తున్న గూగుల్, మోటా లకు ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ( ఈ డి) నోటీసులను జారీ చేసింది. జులై 21వ తేదీన విచారణకు హాజరుకావాలని గూగుల్, మోటా ప్రతినిధులను ఈడి ఆదేశించింది. ఈ రెండు కంపెనీలు ఆన్లైన్ వేదికగా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కోసం అడ్వర్టైజ్మెంట్లను ప్రదర్శిస్తున్నాయని, ఇది చట్ట విరుద్ధమని ఈడి తాను జారీ చేసిన నోటీసులలో పేర్కొంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన సినీ నటులను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇప్పటికే ఈడి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచిన విషయం తెలిసింది. ఇప్పుడు తాజాగా టెక్ దిగ్గజాలైన గూగుల్, మోటా వంటి కంపెనీలకు నోటీసులు జారీ చేయడం ద్వారా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ పై ఉక్కు పాదం మోపాలని వీడి నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది.
Tags:
About The Author

Latest News
11 Aug 2025 17:03:40
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...