ఇబ్రహీంపట్నం సిపిఐ పార్టీ మండల కార్యదర్శిగా కావలి సురేష్.

పెన్ కౌంటర్, ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం సిపిఐ పార్టీ మండల కార్యదర్శిగా కావలి సురేష్.

 

 

సహాయ కార్యదర్శులుగా జంగిలి ప్రవీణ్, శివరాల సూర్యం 

 

సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సిపిఐ మండల కమిటీ

 

భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆప్ ఇండియా(సిపిఐ)మండల నూతన కార్యదర్శిగా కావలి సురేష్ ని శుక్రవారం ఆ పార్టీ మండల మహా సభలో ఎన్నుకున్నారు. ఇబ్రహీంపట్నం కేంద్రంలోని ఎన్ఆర్ గార్డెన్ లో, సిపిఐ పార్టీ 11వ మండల మహాసభలు నిర్వహించారు. ఈ మేరకు జరిగిన నూతన మండల కమిటీ ఎన్నికలో మండల కార్యదర్శిగా కావలి సురేష్ ని మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కావలి సురేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మండల కార్యదర్శిగా ఎన్నుకున్న మండల కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ పార్టీకి ఎంతో చరిత్ర ఉన్నదని, కమ్యూనిస్ట్ లు నిరంతరం పేద ప్రజలకోసం అహర్నిశలు పోరాడతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూమి కోసం కమ్యూనిస్ట్ లు చేసిన పోరాటం మర్వలేనిదన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో భూ పోరాటాలు చేసి నిరుపేదలకు భూములను, ఇంటి పట్టాలను పంచిన చరిత్ర ఉన్న పార్టీ సిపిఐ పార్టీ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సిపిఐ పార్టీ పోరాటం మరువలేనిదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పొత్తు ఉన్న ప్రజల కోసం పోరాటంలో రాజీపడలేదన్నారు. పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ముందుగా గుర్తుకు వచ్చేది కమ్యూనిస్టులే అని అన్నారు. పేదరిక నిర్మూలనకు, పేద వారికి భూమి, ఇంటి స్థలం కోసం సిపిఐ పార్టీ తరపున శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. రాబోయే సంస్థగత ఎన్నికల్లో సిపిఐ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవటానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు కావలి నర్సింహా, ఏఐటీయూసీ నాయకులు ఒరిగంటి యాదయ్య, సిపిఐ నాయకులు నీలమ్మ, శివరాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

మర్రిగూడ లో ఘనంగా టిడిపి ఆవిర్భావం దినోత్సవం  మర్రిగూడ లో ఘనంగా టిడిపి ఆవిర్భావం దినోత్సవం 
        మర్రిగూడ (పెన్ కౌంటర్):-     మండల కేంద్రంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మర్రిగూడ టిడిపి మండల అధ్యక్షులు దోమల వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఘనంగా శ్రీ నీలకంఠ రామస్వామి బ్రహ్మోత్సవాలు
సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి
పెన్ కౌంటర్ కథనంపై స్పందించిన అధికారులు..
చింతపల్లి లో నిబంధనలకు పాతర...?
వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు