ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
By Anand kumar
On
నిషేధిత బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేసిన కేసులో సినీ నటుడు దగ్గుపాటి రానా ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడి) నాలుగు గంటల పాటు విచారించింది. బెట్టింగ్ యాప్ ల ప్రచారానికి తీసుకున్న రెమ్యూనరేషన్, కమిషన్ల గురించి ఈడి అధికారులు రానా ను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే సినీ నటుడు ప్రకాష్ రాజ్ ను 6 గంటల పాటు, హీరో విజయ్ దేవరకొండ ను నాలుగు గంటల పాటు ఈడి ప్రశ్నించి తమకు కావలసిన సమాధానాలను రాబట్టింది. ఇక ఈనెల 13వ తేదీన సినీనటి మంచు లక్ష్మి హాజరుకావాలని ఈడి ఆదేశించింది. నిషేధిత బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ లో సినీ నటులు మాత్రమే కాకుండా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు కూడా ఈడి వ చారణను ఎదుర్కొంటున్నారు.
Tags:
About The Author

Related Posts
Latest News
05 Sep 2025 22:55:39
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల
నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...