తల్లిని కొట్టి ఇంట్లో నుంచి గెంటివేసిన కొడుకులు కోడళ్లు... ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే?!

తల్లిని కొట్టి ఇంట్లో నుంచి గెంటివేసిన కొడుకులు కోడళ్లు... ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే?!

 

కొడుకులు, కోడళ్లు తనను పోషించక పోగా ఇంట్లోంచి కొట్టి గెంటి వేశారని ఓ వృద్ధురాలు, సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రతినిధులతో కలిసి ఆర్డీవోను ఆశ్రయించింది. ఈ సంఘటన వివరాలలోకి వెళితే... కొడుకులు విదేశాలకు వెళ్లి బాగా సంపాదిస్తున్నా తనకు తిండి పెట్టక కొట్టి ఇంట్లోంచి వెళ్ల గొట్టిన కొడుకులు జగన్, మహేష్, కోడళ్లు గంగ, గౌతమిలపై చర్యలు తీసుకోవాలనిజగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన తులసి వెంకటవ్వ సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తో కలిసి ఆర్డీవో మధుసూదన్ కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆర్డీవో మధుసూదన్ మాట్లాడుతూ వయో వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి పిల్లలదేనని, సమరక్షణ చేయలేని వారికి జైలు శిక్ష, జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు కొడుకులు, కోడళ్లపై వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం సెక్షన్ 2(బి), సెక్షన్ 4(1), సెక్షన్ 24 ప్రకారం కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని వృద్ధుల చట్టం అసిస్టెంట్ పద్మజ ను ఆదేశించారు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు