దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
బీఆర్ఎస్ నాయకత్వాన్ని తాజా పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత రూపంలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో మరొకవైపు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వీడాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని ఆత్మ రక్షణలో పడేసింది . ఒక గువ్వల బాలరాజే కాకుండా, బీఆర్ఎస్ పార్టీని వీడే వారిలో దాదాపు డజన్ మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుండడం పార్టీ నాయకత్వానికి ఏమి చేయాలో పాలు పోని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్లుగా కాలేశ్వరం నివేదిక వెలుగులోకి రావడం, కాలేశ్వరంలో భారీగా అవినీతి జరిగినట్లుగా పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించడంతో బీఆర్ ఎస్ నాయకత్వం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటుంది. కాలేశ్వరం పై కౌంటర్ ఎటాక్ చేయాలని భావిస్తున్న బి ఆర్ ఎస్ నాయకత్వానికి ఇప్పుడు, కేసులు... అరెస్టుల భయం పట్టుకుంది. అదే సమయంలో పార్టీ నుంచి చేజారి పోతారని భావిస్తున్నా మాజీ ఎమ్మెల్యే లను ఎలా కట్టడి చేయడం తెలియక డైనమా లో పడింది.
About The Author
