చికెన్, బోటి వికటించి... ఆర్టీసీ కండక్టర్ మృతి
By Anand kumar
On
బోనాల పండుగ ఓ కుటుంబంలో విషాదంతాన్ని మిగిలింది. బోనాల పండుగ సందర్భంగా తెచ్చుకున్న చికెన్, బోటి తెల్లవారి తిని ఆర్టీసీ కండక్టర్ మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నగర శివారు ఎల్బీనగర్ పరిధిలోని చింతలకుంట లో చోటు చేసుకుంది. ఆదివారం నాడు నగర శివారు ప్రాంతాలలో బోనాల పండుగను ప్రజలంతా సంబరంగా జరుపుకున్నారు. అదేవిధంగా చింతలకుంట లోని ఒక ఆర్టీసీ కార్మికుని కుటుంబం కూడా బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా జరుపుకుంది. బోనాల పండుగ కోసం సదరు ఆర్టీసీ కార్మికుడు చికెన్, బోటి కూర తెచ్చుకొని విందు భోజనాన్ని కుటుంబ సభ్యులతో కలిపి ఆరగించాడు . అయితే మరుసటి రోజు అదే చికెన్, బోటి కూర భుజించడంతో ఫుడ్ పాయిజన్ అయి ఆర్టీసీ కండక్టర్ మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు.
Tags:
About The Author
Related Posts
Latest News
23 Apr 2026 14:20:44
మహబూబ్ నగర్ (పెన్ కౌంటర్ ):
చిన్ననాటి స్నేహం కేవలం ఆటపాటలకే పరిమితం కాదని, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని
