ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు...!
ప్రాణం ఖరీదు 12 లక్షలా..?
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణీ మగ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . సోమవారం బాలింత మృతి చెందినప్పటికీ, మంగళవారం ఈ విషయం బయటకు పొక్కింది . రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన గర్భిణి ప్రసవం కోసం పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో సదరు బాలింత వైద్యం కోసం చేరి బిడ్డను ప్రసవించింది. డాక్టర్ శ్వేతా ప్రియాంక అనే గైనకాలజిస్టు ఆమెకు వైద్యం చేసినట్లు తెలుస్తోంది. ప్రసవం అనంతరం మహిళా గుండె సరిగా కొట్టుకోవడం లేదని మెరుగైన చికిత్స కోసం బాలింత హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యరాలు సూచించారు. వెంటనే బంధువులు, బాలింతను హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యరాలు అప్పటికే మహిళ చనిపోయినట్లు నిర్ధారించారు.
12 లక్షలకు సెటిల్మెంట్
ఈ విషయం ఆసుపత్రి వైద్యరాలు తెలియడంతో మృతదేహంతో ఆస్పత్రి వద్దకు రాకుండా చూడాలని స్థానిక అధికార పార్టీ పట్టణ ముఖ్య నాయకులను రహస్యంగా కలిసి నట్లు తెలుస్తోంది . ఆస్పపత్రి నిర్వాహకులు పోలీసులకు విషయం తెలపడంతో ఆసుపత్రిని వద్ద వారు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మృతురాలు బంధువులు తెలిపారు . మహిళకు గుండె సమస్య ముందే ఉందని మృతురాలి బంధువులు వైద్యులకు చెప్పలేదని వారిది తప్పు లేదని మృతురాలి బంధువులు అసుపత్రి కి వద్దకు రాకుండా నేరుగా ఇంటికే వెళ్లిపోవాలంటూ మధ్యవర్తులుగా వ్యవహరించిన నాయకులు సూచించారు. కానీ మంగళవారం మృతురాలి కుటుంబ సభ్యులతో ఆస్పత్రి నిర్వాహకులు అధికార పార్టీ నాయకులుతో మాట్లాడిన విషయం స్థానికంగా తెలిసింది. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ 12 లక్షల పరిహారం ఇచ్చేందుకు ఆసుపత్రి నిర్వాహకులతో నాయకులు ఒప్పందం చేసినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతుంది. ఈ సెటిల్మెంట్ చేసిన నాయకులకు అదనంగా ఇవ్వాల్సి ఉంటుందనేది సమాచారం. ఈ విషయంపై చౌటుప్పల్ పోలీసు ఉన్నతాధికారులను వార్త మిర్రర్ స్పందించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. కాగా మహిళ మృతికి కారణం సెటిల్మెంట్ విషయంపై నిఘ వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నాయి..
About The Author
