స్వచ్ఛ సర్వేక్షన్ గాలికి... ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వద్ద బహాటంగానే మూత్ర విసర్జన
ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వద్ద ఆర్టీసీ సిబ్బంది స్థానికంగా పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నప్పటికీ, వాటిని వినియోగించుకోకుండా కొంతమంది రోడ్డుపైనే బాహాటంగా మూత్ర విసర్జన చేస్తున్నారు. దీనితో, అటుగా వచ్చిపోయే మహిళలు, విద్యార్థినిలు తీవ్ర అసౌకర్యానికి గురికావాల్సి వస్తుంది. అయినా బాహాటంగా మూత్ర విసర్జన చేసేవారు ఇదేమి పట్టించుకోకుండా, తమ పని తాము కానిస్తున్నామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న అండర్ పాస్ పక్కనుంచి ఎల్బీనగర్ వైపు వెళ్లే చోట ఆర్టీసీ వాహనాలను
సిబ్బంది నిలుపుతుంటారు. ఈ సమయంలో వారు అక్కడే పబ్లిక్ టాయిలెట్ ఉన్నప్పటికీ, కొంతమంది బహిరంగంగానే మూత్ర విసర్జన చేస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. మూత్ర విసర్జన కోసం పబ్లిక్ టాయిలెట్స్ ను ఉపయోగించుకోవాలని ఒకవైపు స్వచ్ఛ సర్వేక్షన్ పేరిట ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ, మరి కొంతమంది మాత్రం ఇదేమీ పట్టనట్లు నలుగురు తిరిగే చోటనే మూత్ర విసర్జన చేస్తున్నారు. బహిరంగంగా ఇతరులకు అసౌకర్యం కలిగించే విధంగా మూత్ర విసర్జన చేస్తున్న వారిపై నిబంధనల ప్రకారం జరిమానా విధించి తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్ర వినిపిస్తోంది. ముఖ్యంగా ఆర్టిసి సిబ్బంది కొంతమంది, పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇదేమీ పట్టనట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటు.. ఇప్పటికైనా ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వద్ద బహిరంగ మూత్రవిసర్జనను అరికట్టి, స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని తొలగించే విధంగా ఉన్నతాధికారులు తగ్గిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు
About The Author
