రేవంత్ వ్యాఖ్యలకు... గట్టి ఝలక్ ఇచ్చిన కోమటిరెడ్డి

రేవంత్ వ్యాఖ్యలకు... గట్టి ఝలక్ ఇచ్చిన కోమటిరెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత పార్టీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి ఝలక్ ఇచ్చారు. పదేళ్లపాటు నేనే ముఖ్యమంత్రి అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టే విధంగా కోమటిరెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకోవడం, కాంగ్రెస్ పార్టీ విధానాలకు పూర్తి వ్యతిరేకమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్లో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్దంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని గుర్తు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సహించరని తెలిపారు. పాలమూరు బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2034 వరకు ఇంకో పదేళ్లపాటు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటారని, పదేళ్లుగా పెండింగ్ ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. అయితే రేవంత్ వ్యాఖ్యలను కోమటిరెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. తనకు తానే పదేళ్లపాటు ముఖ్యమంత్రిని ఎలా ప్రకటించుకుంటారనిఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు