ఐఏఎస్ అధికారిని శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు

ఐఏఎస్ అధికారిని శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు

ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఓబులాపురం మైనింగ్ కేసులో తనని నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ శ్రీలక్ష్మి, తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ విచారించిన తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో శ్రీలక్ష్మిని ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలిగా న్యాయస్థానం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో శ్రీలక్ష్మి 2022 లో సిబిఐ న్యాయస్థానంలో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. దీనిపైనే ఆమె తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయగా, శ్రీలక్ష్మికి చుక్కెదురయింది. ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఆమెను కేసు నుంచి తప్పించగా, సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిబిఐ వాదనలను వినకుండా తీర్పు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టుకు సూచించింది. సిబిఐ వాదనలు విన్న తర్వాత శ్రీ లక్ష్మీ రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీలక్ష్మి గనులు, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులను నిర్వహించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న కేసు లో సస్పెండ్ కూడా అయ్యారు. ఆ తరువాత తిరిగి ఐఏఎస్ అధికారినిగా బాధ్యతలను చేపట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక శాఖలను నిర్వహించారు.

Tags:

About The Author

Anand kumar Picture

PENCOUNTER.. We Fight Againest Corruption..

Related Posts

Sidebar Ad

Latest News

వేలం పాటలో  69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత వేలం పాటలో 69, 999 లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న సీనియర్ జర్నలిస్ట్ నాగుల ఆనంద్ కుమార్ నేత
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల   నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...
ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తో బోటు... ఔరా అంటున్న సందర్శకులు
కవిత కొత్త పార్టీ ఖాయం... పేరేంటి అంటే?!
రెండేళ్లుగా తిండి పెట్టని భర్త... అనుమానాస్పద స్థితిలో భార్య మృతి..
సమాజ హితమే లక్ష్యం... నామమాత్రపు ధరకే వైద్య సేవ
తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా