సొంత గూటికి చేరిన మర్రిగూడ ఎంపీపీ గండికోట రాజమణిహరికృష్ణ.

మర్రిగూడ(పెన్ కౌంటర్)

సొంత గూటికి చేరిన మర్రిగూడ ఎంపీపీ గండికోట రాజమణిహరికృష్ణ.

 

 

మర్రిగూడ మండలం తాజా మాజీ ఎంపీపీ గండికోట రాజమణి హరికృష్ణ, బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో, కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి, పార్టీలోకి గండికోటను ఆహ్వానించారు. అధికార పార్టీ కాంగ్రెస్ లో ఉన్న ఆయన, ప్రతిపక్ష పార్టీలోకి రావడానికి, స్థానిక నాయకుల పెట్టిన ఇబ్బందే కారణమని చెప్పుకుంటున్నారు. ప్రోటోకాల్, తదితర ముఖ్య అంశాలపై ప్రతినిధ్యం ఇవ్వకపోవడం, ప్రస్తుత అధికార పార్టీ తీరు, నాయకుల పని విధానం నచ్చని కారణంగానే కాంగ్రెస్ ను వీడి, కారు ఎక్కినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటూ జగన్, జిల్లా నాయకులు బచ్చు రామకృష్ణ, రామిడి వెంకటరమణారెడ్డి, తమ్మడపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహ, పిఎసిఎస్ డైరెక్టర్ మేకల గోవర్ధన్, యంజాల యాదగిరి, చెల్లం వెంకటేష్, జిల్లా శివ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు