నలుగురు పిల్లల తల్లి... ప్రియుడే కావాలని వెళ్ళిపోయింది

నలుగురు పిల్లల తల్లి... ప్రియుడే కావాలని వెళ్ళిపోయింది

నలుగురు పిల్లల తల్లి భర్తను కాదనుకొని ప్రియుడే కావాలని పంచాయతీ పెట్టిన సంఘటన వరంగల్ జిల్లాలోని షోడా షా పల్లి పిట్టలగూడెంలో చోటుచేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడే కావాలన్నా పిల్లల తల్లిని ఆమె ప్రియుడుతోనే పంచాయతీ పెద్దలు పంపించి వేశారు. కాలియా శంకర్ కు చంద్రమ్మ కు 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. అమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడాది క్రితం లోక్యా తండా గ్రామపంచాయతీ శివారులోని వేపలగడ్డ తండాకు చెందిన అజ్మీరా రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడు నెలల క్రితం చంద్రమ్మ, రాజు ఇంట్లో ఎవరితో చెప్పకుండా పారిపోయారు. పోలీసులకు భర్త ఫిర్యాదు చేయగా వారు పట్టుకొచ్చారు. పెద్దల మధ్య పంచాయతీ జరగగా, చంద్రమ్మ ను తల్లి గారి ఇంట్లో ఉండాలని కుల పెద్దలు ఆదేశించారు. అయితే చంద్రం మనం రాజు మళ్లీ మాయ మాటలు చెప్పి వేపల గడ్డ తండాకు తీసుకువచ్చినట్లు తెలుసుకున్న భర్త శంకర్, కుటుంబ సభ్యులతో కలిసి వారిపై దాడి చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. చంద్రమ్మ తనకు ప్రియుడే కావాలని చెప్పి వెళ్లిపోగా, భర్త శంకర్ మాత్రం తన భార్య ను తనకు అప్పగించాలని... తల్లి కోసం తన పిల్లల ఏడుస్తున్నారని, తనకే అప్పగించాలని పోలీసులను వేడుకున్నాడు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు