పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు
. ఎస్సై పవన్ కుమార్
By Anand kumar
On
మహాదేవపూర్ పెన్ కౌంటర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పవన్ కుమార్ పేర్కొన్నారు . పశువుల యజమానులు తమ పశువులను వదలడంతో రాత్రి వేళలో రోడ్లపై పడుకోవడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, భారీ వాహనాల రాకపోకలతో పశువులు మృతి చెంది నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో నోటీసు ఇచ్చామని అన్నారు. పశువులు రోడ్లపై రాకుండా యజమానులు జాగ్రత్త లు తీసుకోవాలని లేదంటే గ్రామపంచాయతీ పోలీస్ సమన్వయంతో యజమానులకు జరిమానా గుర్తించడమే కాకుండా పశువులను గోశాలకు తరలించడం జరుగుతుందని అన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
23 Apr 2026 14:20:44
మహబూబ్ నగర్ (పెన్ కౌంటర్ ):
చిన్ననాటి స్నేహం కేవలం ఆటపాటలకే పరిమితం కాదని, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని
