ఒక భర్త... ఇద్దరు భార్యలు... అతడిని గొడ్డలితో నరికి చంపారు
By Anand kumar
On
భర్తను భార్యలు ఇద్దరు కలిసి గొడ్డలితో నరికి చంపిన ఘటన జనగామ జిల్లా లింగాల గణపురం మండల పరిధిలోని పిట్టలోని గూడెంలో చోటుచేసుకుంది. పిట్టలోని గూడానికి చెందిన కనకయ్యకు ఇద్దరు భార్యలు. చొక్కమ్మ, గౌరమ్మ ఇద్దరు కూడా సొంత అక్క చెల్లెల్లే. కనకయ్య తాగిన మైకంలో యాదాద్రి జిల్లాలోని గుండాల మండలం పరిధిలో సుద్దాలలో తన అత్త అయిన జున్ను బాయి ( చుక్కమ్మ, గౌరమ్మల తల్లి ) ని తాగిన మైకంలో గొడ్డలితో నరికి చంపాడు. ఈ విషయాన్ని తన భార్య లిద్దరికి చెప్పకుండా సిద్దిపేటకు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కనకయ్య కోసం గాలిస్తున్నారు. కనకయ్య పిట్టలోని గూడెం తిరిగి రాగా తమ తల్లిని చంపినందుకు భార్యలు ఇద్దరు అతడితో గొడవపడ్డారు. ఇద్దరు కలిసి అతడిని గొడ్డలితో నరికి చంపి హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
Tags:
About The Author

Related Posts
Latest News
05 Sep 2025 22:55:39
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలోని నాగం పెద్ద రామ్ రెడ్డి ఎంక్లేవ్ వాసుల
నవ రాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ని వేలంపాట...