ఒకే యువతీని పెళ్లాడిన ఇద్దరు అన్నదమ్ముళ్లు...!
అన్నదమ్ములు కలిసి ఒకే అమ్మాయిని వెళ్ళాడారు. అవును... ఇది అక్షరాలా నిజమే. అంతమాత్రాన వారేమీ నిరక్షరాస్యులు కాదు. ఒకరేమో విదేశాలలో ఉద్యోగం చేస్తుండగా, మరొకరు ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒకే అమ్మాయిని వివాహం చేసుకున్న సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోని హట్టి తెగ కు చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి లు ఇద్దరు అన్నదమ్ములు. ప్రదీప్ హిమాచల్ ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తుండగా, కపిల్ విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారు. హిమాచల్ లోని హట్టి తెగ లో కుటుంబ ఐక్యత కోసం ఇలా ఒకే అమ్మాయిని అన్నదమ్ములు పెళ్లి చేసుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ వివాహం తాము ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని ముగ్గురు చెప్పడం విశేషం. వీరి వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓకే యువతిని ఇద్దరు పెళ్లి చేసుకోవడం చట్టవిరుదలైనప్పటికీ, హిమాచల్ లో మాత్రం ఈ అనవాయితీ కొనసాగుతూనే ఉంది.
About The Author
