జనసేన శ్రీకాళహస్తి ఇన్చార్జి అరెస్ట్... డ్రైవర్ హత్య కేసులో ఆమె నిందితురాలు!
శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ కోటా వినుత ఆమె భర్త చంద్రబాబును తమ డ్రైవర్ హత్య చేసిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై సమీపంలోని కూవం నదిలో డ్రైవర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, అనుమానంతో కోట వినుత, ఆమె భర్త చంద్రబాబును అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ మృతదేహం తమ మాజీ డ్రైవర్ శ్రీనివాస రాయుడు దేనని కోట దంపతులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. బొక్కసం పాలెం కు చెందిన శ్రీనివాసులు రాయుడు కోట వినుత వద్ద డ్రైవర్ గా, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అయితే జూన్ 21వ తేదీన అతడు చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా కోటా వినుత ప్రకటించింది. ఆ తరువాత శ్రీనివాసు రాయుడు హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు విచారించి, అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో అరెస్ట్ అయిన కోటా వినుత ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది.
About The Author
