అక్రమ వెంచర్లపై – ప్రజావాణి లో ఫిర్యాదు..

అక్రమ వెంచర్లపై – ప్రజావాణి లో ఫిర్యాదు..

 

  బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చట్టబద్ధంగా అనుమతులు లేకుండానే అనేక అక్రమ వెంచర్లు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, బీజేపీ ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బాలాపూర్ రెవెన్యూ సర్వే నంబర్లు 272, 275, 276, 277, 278, బాలాపూర్ రెవెన్యూ సర్వేనెంబర్ 90, మల్లాపూర్ సర్వే నంబర్ 59, అలాగే నాదర్గుల్, బడంగ్‌పేట్, గుర్రం గూడ, మామిడిపల్లి ప్రాంతాల్లో ప్లాటింగ్, నిర్మాణాలు జరుగుతున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. స్థానికులు అనేక మార్లు బడంగ్‌పేట్ మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదులు చేసినప్పటికీ, ఎటువంటి స్పందన లేకపోవడంతో అధికారుల నిర్లక్ష్య ధోరణిపై ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతోంది. కమిషనర్ ఈ అక్రమాలకు పరోక్షంగా ప్రోత్సాహం ఇస్తున్నారని ప్రజల అభిప్రాయపడుతున్నారని బీజేపీ ఆరోపించింది .ఈ నేపథ్యంలో బీజేపీ బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కి ప్రత్యేకంగా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ

బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అక్రమ వెంచర్లు ప్రజల భద్రతకు, మౌలిక వసతుల పరిరక్షణకు పెద్ద ప్రమాదం. చట్టం తప్పిన నిర్మాణాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కమిషనర్ నిర్లక్ష్యాన్ని కూడా విచారించాలని అధికారులను కోరుతున్నారు అని అన్నారు.

అంతేకాక,ఈ అక్రమాలపై పాలకులు, అధికారులు తక్షణం స్పందించకపోతే బీజేపీ ప్రజల అండతో ఉద్యమబాట పడేందుకు వెనుకాడదు అని ఆయన హెచ్చరించారు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు