మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసే పనిలో బీఆర్ఎస్...
తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ రాజేసే పనిలో ఉన్న బీఆర్ఎస్ కు కొన్ని మీడియా సంస్థలు ఆయాచితంగా అస్త్రాలను అందజేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి దినపత్రిక లో ఆ సంస్థ ఎం డీ రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు వ్యాసంలో తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా? అంటూ నిగ్గదీసి అడిగారు. అయితే రాధాకృష్ణ వ్యాసాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్, ఆ పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకొని మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు రాసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న ఆ పార్టీ కాస్తా ఇప్పుడు భారత రాష్ట్ర సమితి గా మారింది మారింది. మరి అటువంటప్పుడు తెలంగాణ పై బీఆర్ఎస్ కు పేటెంట్ హక్కులెలా ఉంటాయన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది. పార్టీ లో నుంచే తెలంగాణ అన్న పదాన్ని తొలగించిన బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు మళ్ళీ తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు తెలంగాణ సెంటిమెంట్ ను రగల్చడం ద్వారా మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది . అయితే ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ ఇచ్చిన పిలుపుకు స్పందించినట్లుగా ఇప్పుడు తెలంగాణ సమాజం బీఆర్ఎస్ నాయకత్వం సెంటిమెంటు డ్రామాకు లొంగుతుందా? అన్నదే ప్రశ్నార్ధకంగా మారింది?!.
About The Author
