రోడ్లు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

ఎస్పి ఆదేశాలతో రోడ్డుపై ఉన్న బోర్డుల ను స్వచ్చందంగా తొలగించిన వ్యాపారులు

రోడ్లు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

 

ప్రజల సౌకర్యార్థం రోడ్డు అక్రమణలు తొలగిస్తాం

మున్సిపాలిటీతో సమన్వయం చేసుకొని జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్

సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపిఎస్ 

 

సూర్యాపేట(పెన్ కౌంటర్):-

 

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం అండర్ పాస్ వద్ద, జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ పోలీస్ సిబ్బందితో కలిసి రోడ్ ఆక్రమణలను పరిశీలించారు. స్థానికంగా ఉన్న వ్యాపారస్తులతో మాట్లాడి, రోడ్డు ఆక్రమణల వల్ల తలెత్తే సమస్యలను అవగాహన కల్పించారు. రోడ్లు ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారాలను, బోర్డులను తొలగించాలని పోలీస్ సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రజలు వారి అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి పెద్ద సంఖ్యలో వచ్చి పోతుంటారని, సూర్యాపేట కేంద్రంలో వాహనాల రద్దీ బాగా పెరుగుతున్నది దానికి అనుగుణంగా పోలీసుల వాహనాల రద్దీని పునరుద్ధరిస్తూ పని చేస్తున్నారని తెలిపారు. రోడ్లని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల వాహనదారులకు, సాధారణ ప్రజలకు, బాటసారులకు ఇబ్బందులు, ప్రమాదాలు కలుగుతున్నాయన్నారు. దుకాణదారులు, వ్యాపారులు ఎవరు కూడా రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకూడదని ఆయన సూచించారు. రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, సంబంధిత మున్సిపాలిటి అధికారులతో కలిసి రోడ్డు ఆక్రమించిన వ్యాపారాలను తొలగిస్తామని, దీనిపై జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. రోడ్లపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల వాహనదారులు వారి వాహనాలను రోడ్డు మధ్యలో నిలిపివేస్తున్నారన్నారు. ప్రజల సౌకర్యార్థం రోడ్ల ఆక్రమణలను తొలగిస్తామన్నారు. వ్యాపారులు పోలీసు వారికి సహకరించాలని ఆయన కోరారు, దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Tags:
Sidebar Ad

Latest News

తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణ కు రెయిన్ అలర్ట్... 13 నుంచి అతి భారీ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ నుంచి...
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు దగ్గుపాటి రానా
కాలేశ్వరం లో అవినీతి నిజమేనన్న కమిషన్...దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బిఆర్ఎస్ నాయకత్వం
దెబ్బ మీద దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతో న్న బి ఆర్ ఎస్ నాయకత్వం
మానవత్వం చాటుకున్న ఓ ప్రముఖ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంతో బాల కార్మికులకు విముక్తి -జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు