నా తలరాత ఇలాగే రాస్తావా శివయ్య... దేవుడికి లేఖ రాసిన యువకుడు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఓ యువకుడు ఏకంగా దేవుడినే ప్రశ్నిస్తూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. వేములవాడకు చెందిన రోహిత్ (25) ఎమ్మెస్సీ పూర్తి చేసి ప్రస్తుతం బీఈడీ చదువుతున్నాడు. అయితే డాక్టర్ కావాలన్న తో నా కోరిక నెరవేరలేదన్న కారణంగా రోహిత్ ఎప్పుడు అసంతృప్తితో ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ కావాలన్న తోను కోరిక నెరవేరకపోవడంతో జీవితం పై విరక్తి చెందిన రోహిత్, ఏకంగా దేవుడికే లేఖ రాశాడు. నీకు తెలివి ఉంటే నా తలరాత ఇలాగే రాసే వాడివా? అంటూ శివుడిని ప్రశ్నించిన ఆ యువకుడు... అదే నీ కొడుకు అయితే ఇలాగే తలరాత రాసి ఉండేవాడి వా అంటూ నిలదీశాడు. మేమంతా నీ కొడుకులం కాదా అంటూ ప్రశ్నించిన రోహిత్... చివరకు తనకు ఒక మంచి ఆత్మహత్య లేఖ రాయాలన్న కోరిక నెరవేరింది అంటూ ముగించాడు. చావడం కంటే బ్రతకడంలోని బాధ ఎక్కువగా ఉందని రోహిత్ రాసిన లేఖ అందరికీ ఆవేదనను మిగిల్చింది.
About The Author
